SSC Stenographer 2025 : ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission).. మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో లేదా విభాగాల్లో లేదా సంస్థల్లో సుమారు 261 స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణలైన అభ్యర్థులుఅప్లై చేసుకోవడానికి అర్హులు. అయితే.. ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు. అయితే.. సదరన్ రీజియన్‌లోని తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. హైదరాబాద్ (Hyderabad), కరీంనగర్, వరంగల్, గుంటూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాల కోసంఅధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు ఫీజుగా జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC/ ST, PwBD, మాజీ సైనికులు, మహిళలకు దరఖాస్తు ఫీజు ఉండదు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సీ
పోస్టుల వివరాలు: డిపార్ట్‌మెంట్ వారీగా కేటాయింపు తెలియజేస్తారు.
వయస్సు: 01.08.2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది.
కావాల్సిన విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్/ 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – డీ
పోస్టుల వివరాలు : డిపార్ట్‌మెంట్ వారీగా కేటాయింపు తెలియజేస్తారు
వయస్సు: 01.08.2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది.
కావాల్సిన విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యమైన సమాచారం వాటి వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 261 (సుమారు)
దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూన్ 6, 2025
దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ: జూన్ 26, 2025
పరీక్ష తేదీ: 2025 ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు
SSC Steno సెలక్షన్ చేసే విధానం:
1.కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆధారంగా ఎంపిక చేస్తారు.
2.జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ – 50 మార్కులు
3.జనరల్ అవేర్‌నెస్ – 50 మార్కులు
4.ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ – 100 మార్కులు
5.స్టెనోగ్రఫీలో నైపుణ్య పరీక్ష
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.