తల్లికి వందనం పథకం 2025 పెద్ద ట్విస్ట్ ఇచ్చారు: ₹15,000/- కాదు ₹13,000/-మాత్రమే: మిగిలిన 2వేలు ఎందుకు కట్ చేసారు. పూర్తి వివరాలు

Thalliki Vandanam Scheme 2025:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ” తల్లికి వందనం పథకం ” స్కూల్ ప్రారంభం అయ్యే లోపు 15000/- రూపాయలు తల్లుల ఆకౌంట్ లో జమ చేస్తామని అధికారికం గా తెలియజేసారు. కాని ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల అకౌంట్ లో 13000/- రూపాయలు మాత్రమే జమ చేయడం జరిగింది. దానికి కారణం ఏమని అడుగగా ప్రభుత్వం మిగిలిన 2000/- రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కి ఉపయోగిస్తామని తెలియజేసారు. ఈ 2000 రూపాయలు కట్ చేయడానికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం నోటీస్ కూడా విడుదల చేసింది. ఈ 2000 ఎందుకు కట్ చేస్తున్నారు, ఈ పథకానికి అర్హత కలిగినటువంటి వారు వారి యొక్క స్టేటస్ ఏ విధంగా చూసుకోవాలి, కొత్తవారు ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

అకౌంట్ లో ₹15,000/- లలో ₹2,000/- ఎందుకు కట్ చేస్తున్నారు?: వాటికీ గల కారణాలు :

తల్లికి వందనం పథకంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటీసు ప్రకారం, ప్రతి అర్హులైన విద్యార్థిపై ₹2,000/- లబ్ధిదారుని వద్దనుండి మినహాయించి, పాఠశాల లేదా జూనియర్ కాలేజీ మరుగుదొడ్ల నిర్వహణకు, ఇతర సౌకర్యాలను కల్పించడానికి ఉపయోగించినట్లు తెలిపారు. అందువల్ల తల్లికి వందనం కింద చెల్లించాల్సిన ₹15,000 రూపాయల్లో ₹2000 రూపాయలు కట్ చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు తెలపడం జరిగింది.

1. ఇది తల్లికి ఇవ్వబడే మొత్తంలో నుంచి మినహాయిస్తారు
2. ఈ 2000 జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న ఖాతాలో జమ చేస్తారు
3. ఈ డబ్బులను స్కూల్ మెయింటెనెన్స్, శుభ్రత మరియు ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడం జరుగుతుంది.
4. ప్రతి తల్లి ఖాతాలో ₹13,000 రూపాయలు మాత్రమే జమ కావడం జరుగుతుంది.

డబ్బులు జమ అయ్యాయా? లేదా ? ఎలా చెక్ చేసుకోవాలి?

ఈ పథకం కింద అమౌంట్ పడిందా? లేదా? స్టేటస్ క్రింది విధంగా చెక్ చేసుకోవచ్చు.

1. లబ్ధిదారుని యొక్క బ్యాంకు ఖాతా మినీ స్టేట్మెంట్ తీసుకోండి.
2. https://apcfss.in/ వంటి అధికారికి వెబ్సైట్లో గానీ లేదా గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించండి.
3. విద్యార్థి వివరాల ఆధారంగా బెనిఫిషియరీ డీటెయిల్స్ ని చెక్ చేయవచ్చు.

అర్హత ఉన్నవారు ఎలా అప్లై చేయాలి?: వాటికీ కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి?

ఈ పథకానికి మీరు అర్హులైనట్లయితే ఈ క్రింది విధంగా అప్లై చేసుకోండి.

మీ గ్రామంలోని గ్రామ వార్డు సచివాలయం లేదా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ (MEO) నీ సంప్రదించండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఈ క్రింది సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయండి :

1. విద్యార్థి ఆధార్ కార్డ్
2. తల్లి యొక్క ఆధార్ కార్డు
3. విద్యార్థి యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్
4. బ్యాంకు ఖాతా నెంబర్ ఇవ్వాలి.
5. అప్లికేషన్ ఫారం పూర్తి చేసి, అవసరమైన సర్టిఫికెట్స్ జోడించి సబ్మిట్ చేయాలి.

తల్లికి వందనం పథకానికి కొత్తవారు ఇలా అప్లై చేయండి.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply