AP తల్లికి వందనం పథకం 2025 స్టేటస్ చెక్: డబ్బులు వచ్చాయా? లేదా? స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? పూర్తి వివరాలు

AP Thalliki Vandanam Scheme 2025:

శుభవార్త …. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం 2025కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం కింద, ఈరోజు నుంచే రూ.15,000 చొప్పున తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలందరికీ ఇది ఒక బహుమతిలా మారనుంది. పిల్లల చదువుపై మరింత దృష్టి పెట్టేలా ఈ ప్రోత్సాహం పనిచేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఆ పథకం డబ్బులు తల్లుల ఖాతాలో డిపాజిట్ అయ్యాయా లేదా అనే దానికి సంబంధించిన స్టేటస్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. డబ్బులు రాని వారు ఏ విధంగా కొత్త గా అప్లై చేయాలో కూడా క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

డబ్బులు వచ్చాయా లేదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి?:

తల్లికి వందనం పథకం లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక beneficiary status check portal ను అందించనుంది. (Example: https://gsws-nbm.ap.gov.in ). ఇక్కడ మీరు ఈ క్రింది విధంగా చెక్ చేయవచ్చు.

step 1: ముందుగా అధికారిక వెబ్సైట్ https://gsws-nbm.ap.gov.in లోకి వెళ్ళండి.
step 2: know your payment status లేదా Scheme payments ఆప్షన్ పై క్లిక్ చేయండి.
step 3: మీ యొక్క ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి
step 4: Submit పై క్లిక్ చేసిన వెంటనే, మీ అకౌంట్ లోకి పథకం డబ్బులు జమయ్యాయా లేదా అన్నది తెలుస్తుంది.

ఒకవేళ డబ్బులు రాలేదు అంటే?: ఏమి చేయాలి?  వాటికీ గల కారణాలు :

మీకు ఈ తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదు అంటే ముఖ్యం గా ఈ క్రింది కారణాలు ఉండచ్చు.

1. రేషన్ కార్డులో మీ పేరు లేకపోవడం వల్ల
2. భారత సర్టిఫికెట్ లేదా ఇమ్యునైజేషన్ రికార్డ్ అప్లోడ్ చేయకపోవడం.
3. బ్యాంక్ ఎకౌంటు ఆధార్ కి లింక్ చేయకపోవడం.
4. మీ గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా నిర్ధారణ కాకపోవడం.
5. ఈ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మీ గ్రామ,వార్డు సచివాలయ అధికారిని సంప్రదించగలరు.

కొత్తగా ఎలా అప్లై చేయాలి?: 

2025 నుండి నూతన దరఖాస్తుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NBM పోర్టల్ ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటుంది.

1. ముందుగా https://gsws-nbm.ap.gov.in ఓపెన్ చేయండి
2. ” Apply For Thalliki Vandanam scheme 2025” ఆప్షన్ పై క్లిక్ చేయండి
3. లబ్ధిదారుని యొక్క ఆధార్, పిల్లల వివరాలు, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలను నింపండి
4. అన్ని సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి
5. స్టేటస్ ని మీ యొక్క మొబైల్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు.

అర్హతలు మరియు కావాల్సిన డాక్యుమెంట్స్ :

తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి క్రింది అర్హతలు మరియు సర్టిఫికెట్స్ కావాలి.

1. పథకం యొక్క లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యి ఉండాలి.
2. పిల్లలు స్కూల్ కి వెళ్తున్న పిల్లలు అయి ఉండాలి
3. తల్లి మరియు పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి
4. బ్యాంకు ఖాతా ఉండాలి. ఆ ఖాతాకు కచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాలి.
5. ఇమ్యునైజేషన్ రికార్డు కలిగి ఉండాలి
6. పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
7. రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
8. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తల్లి పేరిట ఉండాలి

ముఖ్యమైన సమాచారం : 

పథకం వర్తింపు తేదీ : జూన్ 12, 2025

పొందే సహాయం : ప్రతి బిడ్డకు 15 వేల రూపాయలు సంవత్సరానికి.

ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో , కళాశాలలో చదువుతున్న ఫస్ట్ క్లాస్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు అర్హులు.

పైన తెలిపిన విధంగా మీ స్టేటస్ చెక్ చేసుకుని, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు వెంటనే అప్లై చేయండి

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply