తల్లికి వందనం పథకం ప్రారంభం: కొత్తవారు ఇలా వెంటనే అప్లై చేయండి : వారికి కూడా ₹15,000 జమ అవుతాయి

Thalliki Vandanam Scheme 2025  :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం క్రింద 1st క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి 15,000/- చొప్పున తల్లుల అకౌంట్ లో వేయడానికి ప్రభుత్వం జూన్ 12 వ తేదీ అనగా ఈరోజే ముహూర్తం ఖరారు చేసారు అని అధికారికం గా తెలియజేసారు. స్కూలుకి పంపించే తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు, ప్రతి పిల్లవాడికి ₹15,000/- చొప్పున తల్లి యొక్క బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఏమైనా సాంకేతిక కారణాలవల్ల ఎవరికైనా ఈ పథకం అమలు కాకపోతే, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అవునా కొత్తవారు కూడా ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ₹8,745/- కోట్లు జమ చేయనున్నారు. పిల్లల విద్యను ప్రోత్సహించే ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది, ఒక సారి గమనించగలరు.

తల్లికి వందనం పథకం అర్హతలు :

ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకం డబ్బులు అకౌంట్ లో డిపాజిట్ అవ్వాలి అంటే ఈ క్రింది అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

1. విద్యార్థి తప్పనిసరిగా ప్రభుత్వ / మున్సిపల్ జడ్పీ ఆశ్రిత అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న వారై ఉండాలి.
2. విద్యార్థికి 75% అటెండెన్స్ ఉండాలి.
3. తల్లి పేరుపై బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి.
4.తల్లి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం ₹1.2 లక్షల లోపు ఉండాలి.
5. విద్యార్థి విద్యా సంవత్సరంలో మధ్యలో dropout అయి ఉండకూడదు.

కావలసిన సర్టిఫికెట్స్ వాటికీ సంబందించిన వివరాలు : 

తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి క్రింది సర్టిఫికెట్స్ తప్పకుండ ఉండాలి.

1.తల్లి యొక్క ఆధార్ కార్డు
2.విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్
3.తల్లి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా
4.రెసిడెన్సి సర్టిఫికెట్ ఉండాలి.
5.ఇన్కమ్ లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం.
6.తల్లి యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ తో లింక్ అయి ఉండాలి.
7.విద్యార్థి యొక్క స్కూల్ అటెండెన్స్ సర్టిఫికెట్ ఉండాలి

కొత్తగా దరఖాస్తు చేసుకునే విధానం:

పథకం ప్రారంభించే రోజు జూన్ 12న లేదా తర్వాత అయినా మీకు డబ్బులు జమ కావాలి అంటే కొత్తగా ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోండి.

1.అర్హులైన తల్లి దగ్గర్లోని గ్రామా లేదా వార్డు సచివాలయం లేదా మండల విద్యాధికారి కార్యాలయం నుండి దరఖాస్తు పత్రం తెచ్చుకోవాలి.
2.అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి
3.వాలిడేషన్ తర్వాత లబ్ధిదారుడిగా గుర్తించి, ఆ తల్లి ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.
4.లబ్ధిదారులు మీ సేవ కేంద్రం ద్వారాగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
5.త్వరితగతిని ప్రక్రియ పూర్తవ్వాలంటే గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించండి.

ముఖ్యమైన తేదీలు:

1.తల్లి కి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన ప్రారంభించారు
2.పాత దరఖాస్తుదారులకు ఇప్పటికే డబ్బులు జమ కావడం జరిగింది.
3.డబ్బులు జమ అయిన వారికి sms ద్వారా మెసేజ్ వస్తుంది.
4.లబ్ధిదారులు గ్రామ వార్డు సచివాలయంలో స్టేటస్ కూడా చూసుకోవచ్చు.
5.కొత్త దరఖాస్తుల ప్రక్రియ జూన్ 12వ తేదీ నుండి ప్రారంభమవుతుంది.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply