TG TET 2025 Hall Tickets Released: ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG TET 2025 Exams:

తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2025) పరీక్షల హాల్ టికెట్స్ ఈరోజు విడుదల కావాల్సి ఉండగా, హాల్ టికెట్స్ విడుదలని 11వ తేదీకి పోస్ట్ పోన్ చేస్తూ తెలంగాణ విద్యాశాఖ ప్రకటన జారీ చేయడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని విద్యాశాఖ తెలిపింది. జూన్ 18 నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

1.5 లక్షల మంది అభ్యర్థులు తెలంగాణ టెట్ పరీక్షకి అప్లికేషన్స్ సబ్మిట్ చేశారు. 12 రోజుల పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దానికి అనుగుణంగానే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అందులో ఎటువంటి మార్పు ఉండదని తెలిపింది. తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ విడుదల కొత్త తేదీతో పాటు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి చూడండి .

తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి?

టెట్ హాల్ టికెట్స్  ఈ క్రింది విధం గా  download  చేసుకోండి

1.ముందుగా అభ్యర్థులు తెలంగాణ టెట్ అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in/tgtet/ ఓపెన్ చేయండి.
2.వెబ్సైట్ హోమ్ పేజీలో “TG TET June 2025 hall tickets” ఆప్షన్ పై క్లిక్ చేయండి
3.అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
4.వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి.
5.వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి.

తెలంగాణ టెట్ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల ఎందుకు పోస్ట్ పోన్ చేశారు?

తెలంగాణ టెట్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు జూన్ 9వ తేదీన హాల్ టికెట్స్ విడుదల చేయాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక సమస్యల కారణం వల్ల టెట్ హాల్ టికెట్స్ విడుదల తేదీని జూన్ 11వ తేదీకి విద్యాశాఖ వాయిదా వేయడం జరిగింది. కావున అభ్యర్థులు జూన్ 11వ తేదీ ఉదయం 9 గంటల నుంచి హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని ముఖ్యమైన విషయాలు :

హాల్ టికెట్ విడుదల: జూన్ 11, 2025

డౌన్లోడ్ వెబ్సైట్: tgtet.aptonline.in/tgtet మరియు schooledu.telangana.gov.in

డౌన్లోడ్ కోసం అవసరమయ్యే వివరాలు: Journal No. + Date of Birth

పరీక్ష తేదీలు: జూన్ 18–30, రెండు షిఫ్ట్‌లలో నిర్వహిస్తారు.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను ప్రతిరోజు చూడండి .

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply