TS ICET 2025 Answer Key, Objections Submit : Check Details @icet.tsche.ac.in

TS ICET 2025 Exam:

తెలంగాణలో రెండు రోజులపాటు జూన్ 8, 9 తేదీలలో TS ICET 2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. రెండో రోజు పరీక్షకు 90.55% మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) 2025 ప్రాథమిక ఉత్తరపు కీని అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ కీని చెక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించగలరు.

TS ICET 2025 Exam Summary:

1.రెండో రోజు తెలంగాణ ఐసెట్ 2025 పరీక్షకు 90.55% మంది విద్యార్థులు హాజరయ్యారు.
2.మొత్తం దరఖాస్తు చేసిన అభ్యర్థులు : 71,746 మంది
3.పరీక్షకు హాజరైన అభ్యర్థులు : 64,938
4.తెలంగాణ ఐసెట్ 2025 ప్రాథమిక కీ విడుదల తేదీ: 21st జూన్, 2025
5.అభ్యంతరాల సమర్పణకు చివరి తేదీ : 26th జూన్, 2025
6.అధికారిక వెబ్సైట్ : https://icet.tsche.ac.in

TS ICET 2025 Answer Key Download:

తెలంగాణ ఐసెట్ 2025 పరీక్ష రాసిన విద్యార్థులు జూన్ 21వ తేదీన ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్సర్ కిలో ఏమైనా తప్పులు గమనించినట్లయితే అభ్యర్థులు అభ్యంతరాలు పెట్టుకోవడానికి జూన్ 26వ తేదీ వరకు సమయం ఇచ్చారు.

ఫైనల్ రిజల్ట్స్ విడుదల ఎప్పుడు చేస్తారు?

తెలంగాణ ఐసెట్ 2025 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కే ని జూన్ 21వ తేదీన విడుదల చేసి జూన్ 26వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ని జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.

ఆన్సర్ కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

1.ముందుగా తెలంగాణ ఐసెట్ 2025 వెబ్సైట్ ఓపెన్ చేయండి
2.వెబ్సైట్ హోం పేజ్ లో” TS ICET 2025 Answer Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి
3.సెట్ల వారీగా పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతాయి.
4.అందులో ఉన్నటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్స్, మీ రెస్పాన్స్ షీట్ లో ఉన్నటువంటి ఆన్సర్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి.

అభ్యంతరాల సమర్పణ (Objection Submission) వివరాలు:

అభ్యర్థులు తమకు ఎలాంటి పొరపాట్లు లేదా అనుమానాలు ఉంటే, నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యంతరాలను సమర్పించవచ్చు.

1.అభ్యంతరాల సమర్పణ చివరి తేదీ: విడుదలైన తేదీ నుంచి 3 రోజుల లోపు
2.సమర్పణ మాధ్యమం: ఆన్‌లైన్ ఫార్మాట్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా (వెబ్‌సైట్‌లో వివరాలు ఉంటాయి)

అభ్యంతరాల ఫార్మాట్‌లో ఇవ్వాల్సిన వివరాలు:

1.హాల్ టికెట్ నంబర్

2.ప్రశ్న నంబర్

3.సెట్ కోడ్ (A/B/C/D)

4.అధికారిక సమాధానం

5.అభ్యర్థి సమాధానం

6.అభ్యంతరానికి నిదర్శనాలు

ముఖ్యమైన సూచనలు:

అభ్యంతరాల సమర్పణకు తర్వాతే తుది ఉత్తరపు కీ విడుదల అవుతుంది.

తుది కీ ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తారు.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.

ఫలితాల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది.

 

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply