TS inter supplementary exams results 2025:
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు శుభవార్త. ఫలితాలను జూన్ 16వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. పరీక్ష ప్రశ్న పత్రాల కరెక్షన్ జూన్ 10 వ తేదీ లోగ పూర్తి చేసి జూన్ 16 వ తేదీన ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలియజేసారు.
ఫలితాలను జూన్ 13 లేదా 14వ తేదీన కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు .
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు , ఇంప్రూవ్మెంట్ కు , ఎంతమంది అప్లై చేశారు:
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇంటర్ వార్షిక పరీక్షలు ఫెయిల్ అయిన వారు 2.89 లక్షల మంది కాగా, ఇంప్రూవ్మెంట్ కోసం 1.23లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు.
1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి.
2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” TS inter supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు రోల్ నెంబర్ తో పాటు డేట్ అఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4. వెంటనే స్క్రీన్ పైన విద్యార్థి యొక్క మార్క్స్ డౌన్లోడ్ అవుతాయి.
5. మార్క్స్ మెమో ప్రింట్ అవుట్ తీసుకోండి.