ధూప దీప నైవేద్య పథకం ద్వారా గ్రామీణ దేవాలయాలలో 6000 ఆర్థిక సహాయం | Dhupa Deepa Naivedhyam Scheme

Dhupa Deepa Naivedhyam Scheme:

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న ఆలయాలలో ధార్మిక కార్యకలాపాలను బలోపేతం చేయడాన్ని లక్ష్యం గా పెట్టుకుంది. ఈ దిశ గా రాష్ట్ర దేవాదాయ శాఖ ” ధూప దీప నైవేద్య పథకం” కింద అర్చకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఈ పథకం గ్రామీణ దేవాలయాలకు స్థిరమైన మద్దతుగా నిలుస్తోంది.
ఈ పథకం ద్వారా గ్రామీణ ఆలయాలల్లో రోజువారీ పూజా కార్యక్రమాలు, దీపారాధనలు, నైవేద్యం వంటి సాంప్రదాయ సేవలు నిరంతరం గా కొనసాగేలా చూడటం ముఖ్య ఉద్దేశం . చిన్న గ్రామాల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఆలయాలు కూడా ఈ పథకం ద్వారా పూజా కార్యక్రమాలు,నిర్వహించేందుకు ఆవకాశం పొందుతాయి.

ఆర్ధిక మద్దతు వివరాలు :

ఈ పథకం కింద ప్రభుత్వం అందించనున్న ఆర్ధిక సహాయ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. ప్రతి eligible దేవాలయానికి నిర్వహణ ఖర్చుల నిమిత్తం నెలకు రూ 4000/-
2. అర్చకులకు గౌరవ భృతి రూపం లో నెలకు రూ . 6000/-
ఈ నిధులు ఆలయ నిర్వహణ ,పూజ సామాగ్రి,మరియు అర్చకుల జీవనాధారం గా ఉపయోగపడతాయి.

అర్హత వివరాలు :

దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు క్రింద అర్హతల్ని కలిగి ఉండాలి.
సంబంధిత గ్రామానికి చెందిన వారు అయి ఉండాలి.
ఆలయ విధుల్లో నిబద్ధతతో సేవ చేయ గల సామత్యం ఉండాలి.
అర్చకులుగా దరఖాస్తు చేయాలనుకునే వారు పూజ సంబంధిత విద్య లేదా అనుభవం కలిగి ఉండటం మంచిది.

దరఖాస్తు ప్రక్రియ :

అభ్యర్థులు సంబంధిత జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషన్ కార్యాలయానికి 2025 మే 24 లోపు తగిన పత్రాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వయంగా సమర్పించవచ్చును లేదా పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు.

ముఖ్యమైన పత్రాల వివరాలు :

1. పూర్తిచేసిన దరఖాస్తు ఫారం

2. ఆధార్ కార్డు నకలు

3. నివాస ధ్రువీకరణ పత్రం

4. పాస్ పోర్ట్ సైజు ఫోటోలు

5. పూజ సంబంధిత అనుభవ పత్రాలు (అవసరమైతే )

6. ఆదాయ ధ్రువీకరణ పత్రము (ఐచ్చికం ).

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక విధానం మండలి పరిశీలనా ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థి అర్హత, అనుభవం,గ్రామానికి సంబందించినటువంటి అంశాల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ఈ పథకం గ్రామీణ దేవాలయాల పునరుద్దనికి కీలకంగా నిలుస్తుంది. అర్చకులు తమ సేవల ద్వారా సంప్రదాయాలను నిలబెట్టే అవకాశం పొందుతారు. ఆదాయ వనరులు లేని ఆలయాలు కూడా ధూప దీప నైవేద్య పథకం ద్వారా పూజ కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply