పరీక్ష లేకుండా మున్సిపల్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs 2026

Telangana Municipal Corporation Jobs 2026 notification for 26 Technical Assistant and Multi Tasking Staff posts with no exam and no application fee.
Telangana Municipal Corporation Jobs 2026 – 26 Posts | No Exam | No Fee | Apply Before 9 March 2026.

పరీక్ష లేకుండా మున్సిపల్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs 2026

Telangana Municipal Corporation Jobs Notification 2026

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా మున్సిపల్ కార్యాలయం నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

మొత్తం 26 ఖాళీలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష లేదా అప్లికేషన్ ఫీజు ఉండదు. అభ్యర్థులను కేవలం స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన వివరాలను పరిశీలించి గడువు లోపు దరఖాస్తు చేయాలి.

పోస్టుల వివరాలు

సంస్థ పేరు:
తెలంగాణ మున్సిపల్ డిపార్ట్మెంట్

భర్తీ చేయబోయే పోస్టులు:

  1. టెక్నికల్ అసిస్టెంట్

  2. మల్టీ టాస్కింగ్ స్టాఫ్

మొత్తం ఖాళీలు:
26 పోస్టులు

ఉద్యోగ విధానం:
కాంట్రాక్ట్ ఆధారంగా

విద్యార్హతలు

Telangana Municipal Corporation Jobs 2026 కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

  • కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిగ్రీ

  • నిమిషానికి 25 – 30 పదాల టైపింగ్ స్పీడ్

  • MS Office పై మంచి పరిజ్ఞానం

  • డిజిటల్ మరియు మొబైల్ అప్లికేషన్లపై అవగాహన

  • సంబంధిత అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది

వయస్సు పరిమితి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు:

  • కనీస వయస్సు – 18 సంవత్సరాలు

  • గరిష్ట వయస్సు – 44 సంవత్సరాలు

SC, ST, BC మరియు ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు

ఈ నియామకాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లై చేయవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

జీతం వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం ఇలా ఉంటుంది:

  • టెక్నికల్ అసిస్టెంట్: ₹25,000

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్: ₹18,000

ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉండటంతో ఇతర అలవెన్సులు ఉండవు.

ఎంపిక విధానం

Telangana Municipal Corporation విడుదల చేసిన ఈ పోస్టులకు ఎంపిక విధానం చాలా సులభంగా ఉంటుంది.

  1. అభ్యర్థులు ముందుగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి

  2. షార్ట్‌లిస్ట్ అయిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు

  3. ఈ నియామకాలకు రాత పరీక్ష ఉండదు

  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత తుది ఎంపిక జరుగుతుంది

అవసరమైన డాక్యుమెంట్స్

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది పత్రాలను జత చేయాలి.

  • బయోడేటా / అప్లికేషన్ ఫారం

  • విద్యార్హత సర్టిఫికెట్స్

  • అనుభవ ధ్రువపత్రాలు (ఉంటే)

  • ఆధార్ కార్డు

  • కుల ధ్రువీకరణ పత్రం

  • 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

  • పై డాక్యుమెంట్స్ 2 సెట్ల జిరాక్స్ కాపీలు

అప్లికేషన్ సమర్పించాల్సిన అడ్రస్

అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారం మరియు అవసరమైన సర్టిఫికెట్లను వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి.

సందేహాలు ఉంటే క్రింది మొబైల్ నంబర్లను సంప్రదించవచ్చు:

📞 9177933822
📞 9398003089

ఎలా అప్లై చేయాలి?

Telangana Municipal Corporation Jobs 2026 కు అప్లై చేయాలంటే:

  1. అధికారిక నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోండి

  2. అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసి పూర్తిగా నింపండి

  3. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయండి

  4. గడువు లోపు వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమర్పించండి

దరఖాస్తు చివరి తేదీ

📅 9 మార్చ్ 2026

Official Website : Click Here

Notification PDF : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Here

Leave a Reply