పోస్టల్ అసిస్టెంట్ & సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2025:
భారత ప్రభుత్వ పోస్టల్ విభాగం (India Post) లో పోస్టల్ అసిస్టెంట్ (Postal Assistant) మరియు సార్టింగ్ అసిస్టెంట్ (Sorting Assistant) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా 14,500కిపైగా పోస్టులు భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 32 సంవత్సరాలు మధ్య వయోపరిమితి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?. ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? వాటికీ సంబందించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది, ఒక సారి గమనించగలరు .
పోస్టుల సంఖ్య: 14,500+
పోస్టు పేరు :
పోస్టల్ అసిస్టెంట్: పోస్ట్ ఆఫీసుల్లో క్లర్క్, కస్టమర్ కి సేవలు అందించడం, డేటా ఎంట్రీ లాంటి పలు రకాల పనులు ఉన్నాయి .
సార్టింగ్ అసిస్టెంట్ : సార్టింగ్ అసిస్టెంట్ గా ఎంపికైన వారు మెయిల్స్ సెంటర్లలో పత్రాలు, పార్సిల్స్ ని సార్టింగ్ చేయవలసి ఉంటుంది.
ఎంపిక విధానం : ఈ క్రింది విధం గా ఉంటుంది.
1. రాత పరీక్ష ముందుగా నిర్వహిస్తారు
2. రాత పరీక్ష, లో అర్హత పొందిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
3. డేటా ఎంట్రీ టైప్ స్కిల్ టెస్ట్ ఉంటుంది
4. సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.
5. ఎంపిక చేసుకున్న ఉద్యోగానికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు.
దరఖాస్తు విధానం:Online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి (India Post అధికారిక వెబ్‌సైట్ లో)
ఆఫిషియల్ వెబ్‌సైట్: www.indiapost.gov.in
శాలరీ డీటెయిల్స్ :
SSC , CGL ద్వారా ఎంపికైన పోస్టల్ అసిస్టెంట్లకు.స్టార్టింగ్ జీతం : ₹25,500/- చెల్లిస్తారు.
హౌస్ రెంట్ అలవెన్స్ + ట్రావెల్ అలవెన్సెస్ కూడా కలిపితే నెలకు ₹40,000/- శాలరీ ఉంటుంది.
ప్రభుత్వం ప్రకారం DA, గ్రేడ్ పే , ఇతర అలవెన్సులు కలిపి చాలా మంచి ప్యాకేజీతో శాలరీ ఉంటుంది.
కావాల్సిన అర్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి డిగ్రీ అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 32 సంవత్సరాలు వరకు వయస్సు కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
SC, ST, OBC అభ్యర్థులకు రిజర్వేషన్ తో పాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఆఖరి తేదీ: 4 జులై 2025.
పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ స్పెషలిటీ ఏంటి? వాటికీ గల కారణాలు:
1.ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పర్మినెంట్ జాబ్స్
2.వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది
3.ట్రాన్స్ఫర్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి
4.రాత పరీక్ష అంతగా డిఫికల్ట్ గా ఉండదు
5.ఉద్యోగ భద్రత, పెన్షన్లు , మంచి ప్రమోషన్స్ ఉన్న ఉద్యోగం ఇదే.