తల్లికి వందనం పథకం 2025 ప్రారంభతేది వచ్చేసింది. కావలసిన అర్హతలు మరియు సర్టిఫికెట్స్ పూర్తి వివరాలు

తల్లికి వందనం పథకం 2025 ప్రారంభతేది వచ్చేసింది. కావలసిన అర్హతలు మరియు సర్టిఫికెట్స్ పూర్తి వివరాలు

AP Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్ర ప్రదేశ్ లో స్కూల్ కి వెళ్తున్న పిల్లలకు తల్లులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం (Thalliki Vandanam Scheme 2025) జూన్ 12 వ తేదీ నాడు స్కూల్ reopen రోజు విడుదల చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఒకరికి 15000/- రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకుని సిద్ధం గా ఉంది. కానీ వాటికీ కొన్ని అర్హతలు మరియు సర్టిఫికెట్స్ అన్ని కూడా కావాలి. అవి ఏంటి అనేవి క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

ఈ పథకానికి కావాల్సిన అర్హతలు:

  • నివాసం: ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
  • ఉండవలసిన విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారై ఉండాలి. ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్నవారు అర్హులు. కనీసం 75% హాజరు కలిగి ఉండాలి.
  • తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి
  • తల్లి యొక్క వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.

    ఉండవలసిన సర్టిఫికెట్స్ :

    • విద్యార్థి స్టడీ సర్టిఫికెట్స్
    • తల్లి ఆధార్ కార్డ్
    • తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు
    • నివాస పత్రము లేదా రేషన్ కార్డ్
    • కుల దృవీకరణ పత్రం ఒకవేళ అవసరమైతేనే
    • ఆదాయ సర్టిఫికెట్
    • పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్.

      అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి?:

      1. ముందుగా అధికారిక వెబ్సైట్https://gramawardsachivalayam.ap.gov.in/ ఓపెన్ చేయండి.
      2. ” తల్లికి వందనం” పథకం అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
      3. ఆధార్ వివరాల ఆధారంగా లాగిన్ అవ్వండి.
      4. అన్ని ఖాళీలను పూర్తి చేయండి.
      5. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్ గా సబ్మిట్ చేయండి.
      6. ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాని విడుదల చేసి, తల్లు యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేయనుంది.

       

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply