తల్లికి వందనం పథకం 2025 కొత్త లిస్టు విడుదల- వారికి జూలైలో డబ్బులు జమ : NPCI తప్పులు వల్ల డబ్బులు రాలేదా?- అయితే ఎలా చేయండి

తల్లికి వందనం NPCI లింకింగ్ చెక్ చేసుకోవడమెలా? పూర్తి వివరాలు :

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం క్రింద మొదటి విడత నిధులను జూన్ 12, 2025న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ డబ్బులు నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇందుకోసం తప్పనిసరిగా తల్లికి వందనం NPCI లింక్ అయి ఉండాలి. ఈ NPCI లింక్ ఎలా చేసుకోవాలి వాటికీ సంబంధించిన వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

NPCI లింక్ ఎందుకు చేపించాలి ? అవసరమా? కదా ?

NPCI లింకింగ్ లేకపోతే DBT (Direct Benefit Transfer) ద్వారా ప్రభుత్వం పంపించే డబ్బు మీ ఖాతాలో జమ కావడం కుదరదు. దీపం-2 ఉచిత గ్యాస్ పథకం, రైతు భరోసా వంటి స్కీమ్స్‌లో కూడా ఇదే NPCI లింకింగ్ ఉపయోగంలో ఉంది. ఇప్పుడు తల్లికి వందనం పథకంలో కూడా ఇది తప్పనిసరి.

NPCI లింక్ చెక్ చేసే విధానం:

1. https://www.npci.org.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
2. “Consumers” పై క్లిక్ చేయండి.
3. “BASE (Bharat Aadhaar Seeding Enabler)” అనే ఆప్షన్ ఎంచుకోండి.
4. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి “Seeding” పై క్లిక్ చేయండి.
5. మీ లింకింగ్ స్టేటస్ అక్కడే చూపబడుతుంది.

NPCI లింక్ ఎలా చేయాలి?

మీ బ్యాంక్ ఖాతా ఇంకా NPCIకి లింక్ కాలేదు అంటే, “Fresh Seeding” అనే ఆప్షన్ ఎంచుకోండి:

1. బ్యాంక్ పేరు ఎంచుకోండి.
2. ఖాతా నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
3. రిక్వెస్ట్ పంపించండి.
4. 24 గంటల్లో లింక్ పూర్తవుతుంది.

కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే ఎలా అప్లై చేయాలి? వాటి వివరాలు :

కొత్తగా తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేటువంటివారు, గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు ఫారం నింపి సబ్మిట్ చేయాలి.
అప్లై చేసేటప్పుడు: విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, తల్లి ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, విద్యార్థి యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ లిస్ట్ సబ్మిట్ చేయాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

మీకు డబ్బులు డిపాజిట్ అయ్యాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి?

1. మీ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అయినట్లయితే మీకు SMS వస్తుంది.
2. UPI/AEPS app ద్వారా మినీ స్టేట్మెంట్ చెక్ చేయండి.

ఫైనల్ లిస్ట్ లో మీ పేరు ఉందా? లేదా? ఎలా చెక్ చేసుకోవాలి?

నిన్న, ఈరోజు విడుదలైన కొత్త లిస్టులో కొంతమంది విద్యార్థులకు ₹13,000/- Active అని ఉంది. కానీ Inactive అని ఉన్న వారికి మాత్రం డబ్బులు జమకాలేదు. మీరు పైన చెప్పిన విధంగాNPCI Active చేయించుకుంటే మళ్ళీ మీ అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply