తల్లికి వందనం పథకం శుభవార్త: రేపు వీరికి ₹13,000 రూపాయలు డిపాజిట్ అవుతాయి – అర్హుల జాబితాలో మీ పేరు ఉందొ ? లేదో? ఇలా చెక్ చేసుకోండి?

AP Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. మొదటి విడతలో డబ్బులు డిపాజిట్ కాని వారికి, అభ్యంతరాన్ని పరిశీలించిన తర్వాత అర్హులైన 9.51 లక్షల మందికి రెండవ విడతలో ₹13,000/- రేపు అనగా జూలై 10వ తేదీన తల్లుల ఖాతాలో డిపాజిట్ చేయనున్నారు. మొదటి తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్ లో జాయిన్ అయ్యే విద్యార్థులు, CBSE, ఇతర బోర్డులకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లుల అకౌంట్లో కూడా డబ్బులు డిపాజిట్ చేయడానికి ప్రభుత్వం అర్హుల జాబితాను సిద్ధం చేసింది. జూలై 10వ తేదీన జరగబోయే పేరెంట్ టీచర్ మీటింగ్ లో అర్హులైన తల్లుల అకౌంట్లో వారికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు 13 వేల రూపాయల చొప్పున డబ్బులు డిపాజిట్ చేయమన్నారు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వబడింది. ఒక సారి గమనించగలరు.

అర్హుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి?: వాటి వివరాలు:

1. రెండో విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్లి అక్కడ అర్హుల జాబితా అని అడిగి చెక్ చేసుకోవచ్చు.
2. మీ మొబైల్ లోని ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా చూసుకోవచ్చు.
3. అలాగే అధికారికి వెబ్సైట్లో తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకొని మీ పేరు సరిచూసుకోవచ్చు .

డబ్బు ఎంత deposite అవుతుంది? వాటిని ఎలా చెక్ చేసుకోవాలి?

1. తల్లికి వందనం పథకానికి మొదటి విడతల విడుదల చేసిన విధంగానే ₹15,000/- లకు బదులుగా ₹13,000/- రూపాయలు డిపాజిట్ కానున్నాయి.
2. ₹2,000/- స్కూల్ మెయింటెనెన్స్ కోసం మినహాయించునున్నారు.

జూలై 10న ఎవరికి డబ్బులు డిపాజిట్ అవుతాయి?: మీ పేరు ఉందొ ? లేదో? ఇలా చెక్ చేసుకోండి?

తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత జాబితాలో పేర్లు ఉన్న ఈ క్రింది వారే తల్లుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ గా ఉన్నాయి.

1. ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ తల్లులకు
2. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ లో జాయిన్ అయినా పిల్లల తల్లులకు
3. CBSE, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ కానున్నాయి.
4. గతంలో వీరిని మినహాయించి డబ్బులు డిపాజిట్ చేసిన విషయం తెలిసిందే.
5. ఇప్పుడు వీరిని కూడా అర్హులు జాబితాలో చేరుస్తూ,రెండో విడతలో నిధులు విడుదల చేయనున్నారు.
6. రెండవ విడతలు మొత్తం 9.51 లక్షల మంది లబ్ధిదారులకు డబ్బులు డిపాజిట్ కానున్నాయి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply