ఏపీ తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ విడత జాబితా విడుదల చేశారు: జాబితాలో మీ పేరు ఉందేమో ఇలా చెక్ చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన ప్రారంభించినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి, జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారుల యొక్క వెరిఫికేషన్ జూన్ 28వ తేదీ వరకు చేశారు. ఇప్పుడు వెరిఫికేషన్ పూర్తయినందున 2వ విడత జాబితాని జూన్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. రెండవ విడత జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన ప్రతి విద్యార్థికి ₹13,000/- రూపాయల చొప్పున తల్లి అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. రెండో విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

ముఖ్యమైన తేదీలు? వాటి వివరాలు:

అభ్యంతరాలు పరిశీలన ముగింపు తేదీ : జూన్ 28, 2025
రెండవ విడత లబ్ధిదారుల జాబితా విడుదల తేదీ : జూన్ 30, 2025
రెండవ విడత జాబితాలో పేర్లు ఉన్న వారికి డబ్బులు డిపాజిట్ అయ్యే తేదీ : జూలై 5, 2025

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?: క్రింద విధం గా చెక్ చేసుకోండి:

రెండవ విడత లబ్ధిదారుల జాబితాలో తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ పేరు ఉందో లేదో అనేది మీరు రెండు విధాలుగా తెలుసుకోవచ్చు.

మొదటి విధానం: మొదటగా మీ మొబైల్ లోనే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి: Website Link
తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకొని, విద్యార్థి తల్లి యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనేది తెలుపుతుంది.

2వ విధానం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ నెంబర్ +9195523 00009 ద్వారా
తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

మీరు వెంటనే చేయవలసిన ముఖ్యమైన పని?:

1. జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు సబ్మిట్ చేసిన లబ్ధిదారులు జూన్ 30వ తేదీన మీ దగ్గరలోనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి
రెండవ విడత లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేయించుకోండి.
2. మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా జూలై ఐదో తేదీన 13వేల రూపాయలు డిపాజిట్ అవుతాయి.
3. సచివాలయానికి వెళ్ళలేని వారు మీ మొబైల్ ద్వారా పైన తెలిపిన వాట్సాప్ నంబర్ లేదా అధికారిక వెబ్సైట్ నుండి రెండవ విడత లబ్ధిదారుల జాబితాలో పేరుని చెక్ చేసుకోండి.

రెండో విడత జాబితాలో కూడా మీ పేరు లేనట్లయితే, మీరు అభ్యంతరాలు సబ్మిట్ చేసిన మీ పేరు కనిపించకపోతే మళ్లీ మీరు అభ్యంతరాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం మళ్ళీ ఎప్పుడు కల్పిస్తారో సచివాలయంలో అడిగి తెలుసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *