Aadabidda Nidhi scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైనటువంటి పథకం ” ఆడబిడ్డ నిధి పథకం 2025 ( Aadabidda Nidhi scheme 2025). ఈ పథకాన్ని ఈ జూలై నెలలోనే ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకమైన విడుదల చేసిన ప్రభుత్వం, అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు, కావలసిన సర్టిఫికెట్ల వివరాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే అందించింది. 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకి ₹1500/- చొప్పున సంవత్సరానికి ₹18,000- రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా (DBT) అర్హులైన మహిళల ఖాతాలోకి నేరుగా డిపాజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి కొత్తగా విడుదలైన మార్గదర్శకాలు, ఉండవలసిన అర్హతలు, కావలసిన సర్టిఫికెట్ల వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
ఏపీ ఆడబిడ్డ నిధి పథకం ముఖ్యమైన అంశాలు:
పథకం పేరు: ఆడబిడ్డ నిధి పథకం
ఏ రాష్ట్రం అమలు చేస్తుంది: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఈ పథకం ప్రకటించిన ప్రభుత్వం: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం
ఈ పథకం లబ్ధిదారులు ఎవరు?: 18 నుండి 59 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగిన, తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలు మాత్రమే అర్హులు.
ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు: ప్రతి మహిళకు నెలకు ₹1500/- చొప్పున సంవత్సరానికి ₹18,000 ఆర్థిక సహాయం అందిస్తారు.
లక్ష్యం: ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారిని అభివృద్ధిలోకి తీసుకురావడం.
ఆడబిడ్డ నిధి పథకానికి ఉండవలసిన అర్హతలు: వాటి వివరాలు :
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ అయి ఉండాలి
2. 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళ అయి ఉండాలి
3. ఆ మహిళ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి.
4. బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. అది కూడా (NPCI ద్వారా ఆధార్ లింక్ అయి ఉండాలి )
5. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయి ఉండాలి. (మీసేవాలో )
కావాల్సిన సర్టిఫికెట్స్ :
1. ఆధార్ కార్డు ఉండాలి
2. తెల్ల రేషన్ కార్డు ఉండాలి
3. వయోపరిమితిని నిరూపించే సర్టిఫికెట్ ( పదో తరగతి మార్క్స్ మెమో లేదా డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ )
4. మీ బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి
5. మీసేవ కేంద్రంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయిన రికార్డు కలిగి ఉండాలి.
దరఖాస్తు ఏవిధంగా చేసుకోవాలి?:
1. మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం ద్వారా లేదా మీ సేవ కేంద్రంలో లేదా అధికారిక వెబ్సైటు ఉన్నట్లయితే అక్కడ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.
2. పైన తెలిపిన కావలసిన సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్లి ఫారం నింపాలి.
3. లబ్ధిదారుల యొక్క ఆధార్ బ్యాంకు ఎకౌంటు లింక్ అయి ఉందో లేదో NPCI ద్వారా చెక్ చేయాలి.
4. దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత, మీ యొక్క అర్హత స్టేటస్ను అధికారికి వెబ్సైట్లో గానీ లేదా సచివాలయం ద్వారా లేదా మీ సేవలో చెక్ చేసుకోవచ్చు.
ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించే తేదీ?:
1. ఆడబిడ్డ నీది పథకాన్ని జూలై, 2025 లో ప్రారంభించనున్నారు.
2. ఈ పథకానికి కావలసిన నిధులను కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది.
3. P4 తో అనుసంధానం చేసి, పేదరికం తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కొత్త విధానంలో ప్రారంభించామన్నారు.
ఎంత నగదు డిపాజిట్ అవుతుంది?:
అర్హులైన లబ్ధిదారుల అకౌంట్లో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు ₹1500/- రూపాయల చొప్పున సంవత్సరానికి ₹18,000/- రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT ద్వారా డిపాజిట్ అవుతాయి.
ఆడబిడ్డ నిది పథకం ముఖ్యమైన విషయాలు:
1. లబ్ధిదారుని యొక్క బ్యాంక్ అకౌంట్ NPCI లో ఆధార్ తో లింక్ అయి ఉండాలి.
2. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకుంటే డబ్బులు రావు.
3. పోస్ట్ ఆఫీస్ ఎకౌంట్ కూడా అంగీకరించవచ్చు. అది కూడా అది సేవింగ్స్ అకౌంట్ అయితే.